Suryapet: పెద్ద గట్టు జాతర నిర్వహణకు అంతా సిద్ధం
• ఫిబ్రవరి 16 నుండి 20 వరకు పెద్దగట్టు జాతర.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలు. - సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
Suryapet, pedaa gattu Jathara: పెద్ద గట్టు జాతర నిర్వహణకు అంతా సిద్ధం
ఫిబ్రవరి 16 నుండి 20 వరకు పెద్దగట్టు జాతర.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలు.
- సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
సూర్యాపేట, రాజముద్ర వెబ్ డెస్క్:
తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగామంతుల స్వామి జాతర ఫిబ్రవరి 16 నుండి 20 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు.
శుక్రవారం పెద్దగట్టుపై జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెజస్ మాట్లాడుతూ గతంలో కంటే భక్తులు అధికంగా జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా ఏర్పాట్లను చేశామన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు రెండువేల మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు . అలాగే ప్రత్యేకంగా వందమందితో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . జాతర పరిసర ప్రాంతాలలో మొత్తం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు . దేవాదాయశాఖ ద్వారా శానిటేషన్ సిబ్బంది ని నియమించడం జరిగిందని షిప్టుకు 30 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 90 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఐదు రోజులపాటు పనిచేస్తారని తెలిపారు . మరో 37 మంది అధికారులు పర్యవేక్షిస్తారు అన్నారు .
జాతరలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా 110 మంది విద్యుత్ అధికారులు, సిబ్బందితో 9 లొకేషన్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరధ ప్రధాన పైప్ ద్వారా భక్తులకు త్రాగు నీరు అందింస్తామని, ఇందులో భాగంగా గుట్ట కింది భాగంలో 20వేల లీటర్ల,గుట్టపై ప్రత్యేక ట్యాంకు ఏర్పాటు చేసి నీటిని అందిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం గుట్ట పరిసర ప్రాంతాలలో 25 చోట్ల నల్లాలను, 12 చోట్ల టబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 8 చోట్ల ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 24 మంది డాక్టర్లతో పాటు 190 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని, మూడు అంబులెన్స్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు.
గుట్ట వద్ద మూడు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఐదు రోజులపాటు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కమిటీలు పర్యవేక్షిస్తాయని కలుషిత ఆహార పదార్థాల నియంత్రించేందుకు కృషి చేస్తామన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సిబ్బందికి కేటాయించిన షిఫ్ట్ ల ప్రకారం విధులకు హాజరు కావాలని 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
జాతరలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే సూర్యాపేట ఆర్డిఓ, జాతర నోడల్ అధికారి వేణుమాధవ్ కు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశ అనంతరం అధికారులతో కలిసి జాతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు .ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, సిపిఓ ఎల్ కిషన్, జిల్లా వైద్యాధికారి కోటాచలం, సూర్యాపేట డిఎస్పి రవి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తాసిల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, దేవాలయ ఈవో కుశలవయ్య, ఇంట్రా ఈఈ శ్రీనివాసరావు, గ్రిడ్ఈ ఈ కర్ణాకర్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారి పాలరాజ్,ఎడిఈ రాములు నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.