Valigonda: ఒకటే భవనంలో మూడు పాఠశాలలు

• అంగన్వాడీలకు పక్కా భవనాలు ఎప్పుడు

On
Valigonda: ఒకటే భవనంలో మూడు పాఠశాలలు

Valigonda: ఒకటే భవనంలో మూడు పాఠశాలలు

అంగన్వాడీలకేవీ పక్కాభవనాలు

Also Read:  Telangana, BC Commission: ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్


వలిగొండ, రాజముద్ర న్యూస్:ఒకటే భవనం.. పాఠశాలలు మూడు.. అవును ఒకటే భవనంలో మూడు పాఠశాలలు కొనసాగుతున్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్న జరిగేది మాత్రం నిజం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో కొనసాగుతున్న పాఠశాల భవనం 8 గదులతో నిర్మించబడిన ఒక భవనంలో ఒక ప్రాథమిక పాఠశాల రెండు అంగన్వాడి సెంటర్లు కొనసాగుతున్నాయి. 45 మంది పిల్లలతో ప్రాథమిక పాఠశాల కొనసాగుతుంది. అదేవిధంగా గ్రామంలో మూడు అంగన్వాడి సెంటర్లు ఉన్నప్పటికీ 2 అంగన్వాడి సెంటర్ ఇదే భవనంలో కొనసాగుతున్నాయి. అంగన్వాడి టు లో 10 మంది చిన్న పిల్లలు, ముగ్గురు బాలింతలు, ఇద్దరు గర్భిణీలు ఉండగా, అంగన్వాడి 3 సెంటర్ లో 9 మంది పిల్లలు ఇద్దరు బాలింతలు నలుగురు గర్భిణీలు ఉన్నారు. గతంలో అంగన్వాడి 2 కేంద్రానికి స్థలం కేటాయించిన ఇప్పటికీ ఎలాంటి భవన నిర్మాణం జరగలేదు. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించి అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read:  Telangana Secretariat: తెలంగాణలో నకిలీ ఉద్యోగుల గందరగోళం 

Views: 118

About The Author

Latest News