Bheemadevarapally, Mutharam: ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
On

ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
మండలంలోని ముత్తారం (Mutharam)గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి (CC Road)నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్టెంపల్లి ఐలయ్య, ఊరడి జేపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సిసి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఊరడి యుగంధర్ రెడ్డి, దేవరాజు శంకర్, మ్యాక స్వామి, ఏనుగు సత్తిరెడ్డి, రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 258
Tags:
About The Author
Related Posts
Latest News
15 Mar 2025 17:17:58
ముత్తారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలోని ముత్తారం (Mutharam)గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి (CC Road)నిర్మాణ పనులను...