Choutppal: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
• విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను తిలకించిన ఏటీపీ అనురాగిణి

విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహన అవసరం
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఏటీపీ అనురాగిణి
చౌటుప్పల్.మార్చి3.రాజముద్ర వెబ్ డెస్క్:
రానున్న కాలంలో విద్యార్థులు బావి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి ఉపయోగపడాలని ఏటీపీ అనురాగిణి అన్నారు. కొత్తగూడెం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సోమవారం విజ్ఞాన శాస్త్ర(science fair) ప్రదర్శనను విద్యార్థులు ఏర్పాటు చేశారు. సి.వి రామన్(C.V.Raman) చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
విద్యార్థులు పలు విధాల సైన్స్ ప్రయోగాలను తయారుచేసి ప్రదర్శించాగా పలు సైన్స్ ప్రయోగాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల ఏటీపీ అనురాగిణి మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం కీలకపాత్ర వహిస్తుందని ప్రతి విద్యార్థి విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.విద్యార్థులు తయారుచేసిన పలు ప్రయోగాలు ఎంతగానో ఆకర్షించాయి. విద్యార్థులకు సహకరించిన సైన్సు ఉపాధ్యాయులను ఏటీపీ అనురాగిణి అభినందించారు.
అనంతరం పలువురు సైన్స్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా బయటపడుతుందని అన్నారు. ఇటువంటి ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవ విజ్ఞానాన్ని పొందగలుగుతారన్నారు. సృజనాత్మక ప్రయోగాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు అనురాగిణి,లీలా, షబానా, సుశీల, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, అభినవ్, నరసింహ,జగదీష్ , విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.