Bheemadevarapally, Kothapally: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట
ఏఈ లక్ష్మణ్ నాయక్

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట
- ఏఈ లక్ష్మణ్ నాయక్
భీమదేవరపల్లి, రాజముద్ర వెబ్ డెస్క్:
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హనుమకొండ రూరల్ డివిజన్ పరిధిలోని భీమదేవరపల్లి సెక్షన్,డివిజన్ పరిధిలో గల కొత్తపల్లి(kothaplly)గ్రామ శివారు గోపాలపూర్ క్రాస్ వద్ద కొత్తపల్లికి చెందిన రైతు పొలంలో విద్యుత్ స్తంభాలు వంగిపోయి విద్యుత్ తీగలు రైతుల పొలంలో మనుషులకు తగిలే విధంగా ఉండటంతో రైతు పొలం బాటలో భాగంగా విద్యుత్ స్తంభాలను సరిచేసి కరెంటు తీగలను సరి చేశారు. అంతేకాకుండా రాత్రిపూట ట్రాన్స్ఫారం వద్ద ఎవరైనా రైతుకు విద్యుత్ అపాయం కలుగకుండా ఉండే విధంగా ట్రాన్స్ఫార్మర్లు సరి చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ లక్ష్మణ్ నాయక్, లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్, లైన్మెన్లు విజయ్ కుమార్, బాలరాజు, ఏ ఎల్ ఎం లు మల్లేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రకాష్, అనిల్, కట్టర్ శ్రీనివాస్, రైతులు సట్ల భాస్కర్, శంకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.