Valigonda: ఎండిన పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా

• మాటూరి బాలరాజు  రైతు సంఘం జిల్లా కార్యదర్శి  డిమాండ్.

On
Valigonda: ఎండిన పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా

Valigonda, MRO office: ఎండిన పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని వలిగొండ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద  రైతుల ధర్నా

   
ఎండిన పంట పొలాలను అధికారులు సందర్శించాలని పంట నష్టాన్ని అంచనా వేయాలి...
 
-మాటూరి బాలరాజు 
రైతు సంఘం జిల్లా కార్యదర్శి  డిమాండ్...

వలిగొండ రాజముద్ర న్యూస్:పంటలకు నీరు అందక నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనీ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున వలిగొండ తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని నీరు లేక వరి పంట ఎండిపోయిన రైతుల ను సమీకరించి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాటూరి బాలరాజు మాట్లాడుతూ జిల్లాలో బోరు బావులపై ఆధారపడి   వరి సాగుచేసిన రైతులు ప్రైవేట్ వడ్డీలకు అప్పులు చేసి పంటలు వేశారని తెలిపారు.
 రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సుంకిశాల,  పులిగిల్ల,గోలిగూడెం, కంచనపళ్లి,
చిత్తాపురం, పహిల్వాన్ పురం, పల్లెంపు,టేకుల సోమారం గ్రామాలలో సర్వే నిర్వహించి పంటలను పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు.ఆరు కాలం కష్టపడి ఎకరానికి లకు పెట్టుబడి పెట్టిన రైతాంగం పొట్ట దశలో ఉన్న పంట చేలు నీరు లేక ఎండిపోయాయని
పశువుల మేతకు కోసి వేస్తున్నారని పంటలు పోయే అప్పులు తీరే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం గ్రామాల వారీగా ,పంటల వారీగా ,రైతుల పొలాల పంట నష్టo అంచనా వేసి సర్వే రిపోర్టుని ప్రభుత్వానికి అందించాలని ,జిల్లా కలెక్టర్,
వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా మంత్రులు శాసనసభ్యులు తక్షణము స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కుల పంటలను పరిశీలన చేసి ప్రభుత్వం ద్వారా వరికి మనకి 25 వేల రూపాయల చొప్పున మిర్చికి 25వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, రైతు సంఘం  మండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డి, జిల్లా నాయకులు చీర్క శ్రీశైలం రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాకిటి వెంకటరెడ్డి, మండల నాయకులు కొండే కిష్టయ్య, మంగ బాలయ్య, బందారపు ధనంజయ, రైతులు మల్లారెడ్డి, కొమ్మిడి సత్తిరెడ్డి, మొగిలిపాక ఎల్లస్వామి, పోలేపల్లి ఉప్పలయ్య, కందుల మత్స్యగిరి, దంతూరి నరసింహ, చేగురి ఐలయ్య, తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Views: 135

About The Author

Latest News

Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు  Bheemadevarapally, Mulkanoor: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు 
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు    భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలో హోలీ(Holi) వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే యువత (youth) రోడ్లపైకి వచ్చి ఒకరికి ఒకరు...
Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత
Bheemadevarapally : దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు  
Bheemadevarapally, Kothapally: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట
Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 
Bheemadevara Pally, Mulkanoor:నీటి సరఫరాలో అంతరాయం 
Bheemadevarapally, Mulkanoor : నీటి సరఫరాలో అంతరాయం