Bheemadevarapally : దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె ఎస్ ఆర్

దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె ఎస్ ఆర్
భీమదేవరపల్లి,రాజముద్ర వెబ్ డెస్క్:
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ (Mulkanoor), భీమదేవరపల్లి (Bheemadevarapally), కొత్తకొండ (kothakonda) గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి (JSR) ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాలను బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు, ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి దృష్ట్యా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె ఎస్ ఆర్ (JSR) చలి వేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరుసగా 4వ సంవత్సరం వాటర్ ఫ్రిజ్ లను ప్రజల దాహార్తి తీర్చడం కోసం ప్రారంభించడం జరిగిందని అన్నారు. వాటర్ ఫ్రిజ్ ల ద్వారా చల్లటి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, ఊసకోయిల కిషన్,సదానందం,బుర్ర శివసాగర్ ,వీరన్న,అయిత సాయి తేజ,శ్యామ్,కంకల సదానందం,బైరి సదానందం,సతీష్,శ్రీకాంత్, మాడుగుల అజిత్,శివకుమార్,అరుణ్,రాజు,శ్రీనివాస్,రమేష్,అరుణ్, సురుగురి విష్ణు,పోలు దిలీప్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.