Bheemadevarapally, Mulkanoor : నీటి సరఫరాలో అంతరాయం
ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
On

Bheemadevarapally, Mulkanoor : నీటి సరఫరాలో అంతరాయం
-ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
-పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్
భీమదేవరపల్లి, రాజముద్ర వెబ్ డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూరు( Mulkanoor)గ్రామంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు(Two Days)నీటి సరఫరాకు (water supply)అంతరాయం కలగనుంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్ తెలియజేశారు. లోడుతో ఉన్న టిప్పర్ అంగడి బజారు నుండి వెళ్తుండగా పైపులైను పగలడం జరిగింది. దీంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రామ పంచాయతి సిబ్బందితో మరమ్మత్తులు చేపట్టారు. రెడ్డి బజార్, గొల్లవాడ, లింగారెడ్డి బజార్, రాపల్లి బజార్, మసీదు వాడ(Masjeedh street),కుమ్మరివాడ, చౌరస్తా, ప్రకాశం బజార్, సూపర్ బజార్ కమ్మరి బజార్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని, ప్రజలు నీటిని పొదునుగా వినియోగించుకోవాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు.
Views: 125
Tags:
About The Author
Related Posts
Latest News
14 Mar 2025 13:02:54
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: మండలంలో హోలీ(Holi) వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండే యువత (youth) రోడ్లపైకి వచ్చి ఒకరికి ఒకరు...