Bheemdevara Pally, vangara: వంగర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం 

On
Bheemdevara Pally, vangara: వంగర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం 

Bheemdevara Pally, vangara: వంగర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం 

భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్ : 

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా శివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీవీ నరసింహారావు  సోదరుడు మనోహర్ రావు తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,పాడి పంటలతో రైతులు అంతా సంతోషంగా ఉండలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఎన్నికల కోడ్ ఉంది అధికారులు బాధ్యత తీసుకొని తాగు సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వేసవి కాలంలో గ్రౌండ్ వాటర్ పడిపోయినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.
దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఎన్ని నిధులు అయినా ఇస్తామని చెప్పారు.గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. కోడ్ ఐపోగానే ప్రత్యక్షంగా గ్రామాలను సందర్శిస్తం.
గ్రామాల్లో తాగు సాగు నీటికి ఇబ్బంది వస్తె జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి మా స్థానిక నాయకులు తీసుకోవాలి.
శివరాత్రి పూట అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత

Views: 85
Tags:

About The Author

Latest News