Loan waiver: రైతులకు గుడ్ న్యూస్... 2 లక్షల రుణమాఫీకి లైన్ క్లియర్ : సీఎం రేవంత్ రెడ్డి
On
![Loan waiver: రైతులకు గుడ్ న్యూస్... 2 లక్షల రుణమాఫీకి లైన్ క్లియర్ : సీఎం రేవంత్ రెడ్డి](https://www.rajamudranews.com/media-webp/2024-04/img_20240415_221958.jpg)
Good News to Farmers: రైతులకు గుడ్ న్యూస్... 2 లక్షల రుణమాఫీకి లైన్ క్లియర్ : సీఎం రేవంత్ రెడ్డి
నారాయణపేట జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ పై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ వరకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీకి కసరత్తు జరుగుతుందని తెలిపారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జన జాతర సభలో తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీకి అంగీకారం తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి రుణమాఫీ కాలేదని, ఆగస్టు నెల 15వ తేదీ వరకు ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని రైతులు ఇబ్బంది పడకుండా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు కసరత్తు జరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వరి పంటకు రూ. 500 బోనస్ కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పేది లేదు... మడమ తిప్పేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని ప్రజలే పాలకులు అని, నాయకులే సేవకులుగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీకి నానా తంటాలు పడి రైతన్నను నడ్డి విరిచిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తుందని రాబోయే రోజుల్లో మరింతగా సంక్షేమం వైపు దృష్టిసారిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందని తెలిపారు.
ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రస్తుతం ఐదు గ్యారంటీలు అమలులో ఉన్నాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపితో దోబూచులాడుతున్నారని తన గారాలపట్టి కవిత లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకు తండ్రి, బిడ్డలు బిజెపితో కుమ్మక్కై పలు స్థానాలలో ప్రచారమే చేయడం లేదని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి అవుతుందని అన్నారు. తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించిన బి ఆర్ ఎస్ పార్టీ, కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాయకులను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తామని అన్నారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే ఉందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో అర్థమైందని తెలిపారు.
Views: 113
About The Author
Related Posts
Latest News
11 Feb 2025 20:58:56
Peddagattu Jathara, Suryapet: తెలంగాణ రాష్ట్రం రెండవ అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధం చేశారు. అదేవిధంగా పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి...