Bheemadevarapally: బీజేపీ అంటేనే ఈడి మోడీ

మంత్రి పొన్నం ప్రభాకర్

On
Bheemadevarapally: బీజేపీ అంటేనే ఈడి మోడీ

కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీ లపై ఈడి వేధింపులు

బీజేపీ అంటేనే ఈడి మోడీ

-కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీ లపై ఈడి వేధింపులు

IMG-20250416-WA0215

 - మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

Also Read:  Bheemadevarapally, Kothapally: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో 

బీజేపీ అంటేనే ఈడి(ED),మోడీ ,ఐటీ(IT)  దాడులు గా పని చేస్తుంది అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి (Bheemadevarapally)  మండలంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి( Kalyana Laxmi) చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి( Indira Mahilaa Shakthi ) ద్వారా చేపల వాహనాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సన్న వడ్లకు ఈసారి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యాన్ని బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని అమ్మాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది అని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయన్నారు. అర్హులకు మాత్రమే ఇల్లు వస్తాయి ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదని  పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం.  త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని అన్నారు. కుల గణన  పూర్తి చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. గౌరవెల్లి కాలువలు పూర్తి చేసి నీరు అందిస్తామని తెలియజేశారు. వంగరకు బండి సంజయ్ సహకారంతో నవోదయ పాఠశాల తీసుకొస్తున్నామన్నారు. ఎన్నికల తరువాత  కాంగ్రెస్ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు  కార్యక్రమాలు చేస్తుండడంతో బీజేపీ మీద వ్యతిరేకత జరుగుతున్న సందర్భంలో మా అధినాయకత్వం అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ లో ఈడి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పై ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ వేధింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకొని హార్స్మెంట్ కోసమే ప్రభుత్వ విధానం నడుస్తుంది. నరేంద్ర మోదీ కి ఇది మంచిది కాదు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి జవాబు చెప్పలేక దేశ వ్యాప్తంగా బీజేపీ వైఫల్యాల పట్ల కాంగ్రెస్ పోరాటాలు చేస్తుంది. మా పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ వైఫల్యాల ప్రజా వ్యతిరేకత పై మా పోరాటాలు కొనసాగిస్తాం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం ఉంది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని వేధిస్తే మంచిది కాదు అన్నారు.అంబేద్కర్ కి దండ వేసి నివాళులు అర్పించని పార్టీ ప్రముఖులు అంబేద్కర్ దగ్గరకు వస్తె రాజకీయం చేస్తే అంబేద్కర్ మీద ప్రేమ ఎంత ఉందో తెలుసు. అంబేద్కరిజం కి వారసులు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రక్షించేది కాంగ్రెస్ పార్టీ. మేము రాజ్యాంగ రక్షణ కోసం మాట్లాడుతుంటే ఓర్వలేక మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.IMG-20250416-WA0217

Also Read:  Bheemadevarapally, Mulkanoor : ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Views: 288
Tags:

About The Author

Latest News