Naagaram, Muncipality: అవినీతికి అడ్డాగా మారిన నాగారం మున్సిపాలిటీ
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇంజనీరింగ్ విభాగం డి ఈ, ఔట్సోర్సింగ్ సిబ్బంది

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు
అవినీతికి అడ్డాగా మారిన నాగారం మున్సిపాలిటీ
- లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇంజనీరింగ్ విభాగం డి ఈ, ఔట్సోర్సింగ్ సిబ్బంది
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు
నాగారం, రాజముద్ర డెస్క్:
ప్రభుత్వం నుండి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ, ఔట్సోర్సింగ్ (Outsourcing) అధికారులే అడ్డదారులు తొక్కుతూ లక్షలాది రూపాయలు లంచాల రూపేనా డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన సంఘటన నాగారం మున్సిపాలిటీ ( Naagaram Muncipality) ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... ఈనెల 21వ తేది సోమవారం సాయంత్రం నాగారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో డి ఈ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి సుదర్శనం రఘు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వి. రాకేష్, వి. సురేష్ లు సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (Anti-Corruption Bureau) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీలో కాంట్రాక్టర్ సుమారు రూ. 11 లక్షల అంచనా వ్యయంతో రోడ్డును నిర్మించారు. గత కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న బిల్లును చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ సమయాన్ని దాటవేస్తూ సదరు కాంట్రాక్టర్ కు చుక్కలు చూపించారు. ఇదే విషయంలో కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం డి ఈ రఘు ను పలుమార్లు అడుగగా రూ. 1,30,000 లంచం డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ విసిగిపోయి చేసేది లేక ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలన్న సదుద్దేశంతో లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోగా, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది రాకేష్, సురేష్ లు కాంట్రాక్టర్ నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే ఆ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ ( Toll-free) నెంబర్ కు తెలియపరచాలని కోరారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.