Bheemadevarapally: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పత్రాలు సమర్పించాలి

ఎంపీడీవో వీరేశం

On
Bheemadevarapally: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పత్రాలు సమర్పించాలి

భీమదేవరపల్లి మండల పరిధిలో 2589 దరఖాస్తులు వచ్చాయి

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పత్రాలు సమర్పించాలి

-భీమదేవరపల్లి మండల పరిధిలో 2589 దరఖాస్తులు వచ్చాయి 

 -ఎంపీడీవో వీరేశం

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించడానికి రాజీవ్ యువ వికాసం పథకం( Rajiv Yuva vikasam scheme) ను ప్రారంభించింది.  దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుండి ప్రారంభించబడి, ఏప్రిల్ 14, 2025 నాడు ముగిసింది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధి వ్యాపారాలను ప్రారంభించడంలో వారికి ఆర్థిక సహాయం అందిస్తోంది. ₹4 లక్షల వరకు రుణ మొత్తాలు, 60% నుండి 80% వరకు సబ్సిడీలతో, ఈ పథకం వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భీమదేవరపల్లి మండల పరిధిలో 2589 దరఖాస్తులు వచ్చాయని  ఎంపీడీవో వీరేశం తెలిపారు. ఇంకా ఆన్లైన్లో దరఖాస్తు చేసి పత్రాలు ఆఫీసులో ఇవ్వనివారు వెంటనే ఇవ్వాలి అని పేర్కొన్నారు.

Also Read:  ఘనంగా సీతారాముల వారి కళ్యాణం..

Views: 199
Tags:

About The Author

Latest News