ఘనంగా సీతారాముల వారి కళ్యాణం..

రామనామస్మరణతో మార్మోగిన ఆలయం

On
ఘనంగా సీతారాముల వారి కళ్యాణం..

శ్రీరామనవమిని పురస్కరించుకొని రాములోరి వివాహ వేడుక ఊరూరా కనులపండువగా సాగింది.మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం Screenshot_20250407_115231~2 అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి వారి కళ్యాణానికి జక్క వెంకట్ రెడ్డి సరిత, కూరపాటి శ్రీనివాస్ కవిత దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.బుగ్గ అశోక్ శ్రావ్య దంపతులు సీతమ్మ వారికి పుస్తే మట్టెలు తీసుకొచ్చారు..అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు..కళ్యాణం లో పాల్గొన్న భక్తులకు కరీంనగర్ కు చెందిన బోల్నెనీ సంపత్ రావు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రవీణ్, ఆలేటి మహేష్,బుగ్గ కృష్ణ, బందారపు నరేష్, మారబోయిన చంద్రశేఖర్, మెరుగు కృష్ణ,,భక్తులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 178
Tags:

About The Author

Latest News