Bheemadevarapally, Mulkanoor: అంబేద్కర్ కు అవమానమా..?

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజి జడ్పీ చైర్మన్ 

On
Bheemadevarapally, Mulkanoor:  అంబేద్కర్ కు అవమానమా..?

మును పెన్నడూ లేనివిధంగా ఫ్లెక్సీలలో రాజకీయ నాయకుల ఫోటోలు..!

అంబేద్కర్ కు అవమానమా..?

మును పెన్నడూ లేనివిధంగా ఫ్లెక్సీలలో రాజకీయ నాయకుల ఫోటోలు..!

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజి జడ్పీ చైర్మన్ 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ నాయకులు అవమానించారని హనుమకొండ ( Hanmakonda) జిల్లా మాజి జడ్పీ చైర్మన్ (ZP Chairman) సుధీర్ కుమార్ ఆరోపించారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సోమవారం నాడు అంబేద్కర్ జయంతి (Ambedker Jayanthi) ఉత్సవాలలో మాజి జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి అంబేద్కర్ ను అవమానించినది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఫ్లెక్సీలలో అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టి నాయకుల ఫోటోలు పెద్దగా పెట్టి అంబేద్కరును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతా, కాంగ్రెస్ పార్టీకి సంబందించిన కార్యక్రమమా అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని కాంగ్రెస్ సభగా నిర్వహించారని పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally: నర్సరీలను సంరక్షించాలి 

Views: 183
Tags:

About The Author

Latest News