అబద్ధపు హామీలతో మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి

On
అబద్ధపు హామీలతో  మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు
జండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లోని ఎల్కతుర్తి లో బిఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని వేములకొండలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుంచి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వరకు BRSV, BRSY రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, బూరుగు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం చేపట్టి తెలంగాణ కోసం పోరాటం చేశారన్నారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి ప్రజలను మోసం చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని వారన్నారు.ఈ కార్యక్రమంలో DCCB

IMG-20250415-WA1160
జండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,బూడిద బిక్షమయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డిరెడ్డి, ఫైళ్ల రాజా వర్ధన్ రెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, సురకంటి వెంకటరెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, పడమటి మమత, కూనపురి కవిత, కొమురెల్లి సంజీవరెడ్డి, గూడూరు శేఖర్ రెడ్డి, మద్దెల మంజుల, డేగల పాండరి, మహ్మద్ అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally: నర్సరీలను సంరక్షించాలి 

Views: 13

About The Author

Latest News