Bheemadevarapally, Chantayapally: ఆశా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

జిల్లా వైద్యాధికారి డా.అల్లెం అప్పయ్య 

On
Bheemadevarapally, Chantayapally: ఆశా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

స్వరూప కుటుంబానికి అండగా ఉంటాం 

ఆశా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

స్వరూప కుటుంబానికి అండగా ఉంటాం 

జిల్లా వైద్యాధికారి డా.అల్లెం అప్పయ్య 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

ముల్కనూర్ ఆరోగ్య కేంద్రం కొత్తకొండ సబ్ సెంటర్ చంటయపల్లి గ్రామ ఆశ కార్యకర్త అందె స్వరూప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్వరూప కుటుంబానికి ఓదార్పుగా ఆర్థిక సహాయం చేయాలని సంకల్పంతో  ముల్కనూర్ వైద్యాధికారి డా. ప్రదీప్ రెడ్డి ఆలోచనతో జిల్లా వైద్యాధికారి డా. అల్లెం అప్పయ్య  నాయకత్వంలో హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ ముందుకు వచ్చి (1,10,000) ఒక లక్ష పది వేల రూపాయలు, సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ ఫాతిమా నగర్ డైరెక్టర్ బాల స్వామి రెడ్డి ( 20,000) ఇరవై వేల రూపాయలు,  మొత్తం జిల్లా ఆశ కార్యకర్తలు( 42,500) నలబై రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసి బుధవారం నాడు ఆశ కార్యకర్త స్వరూప కుటుంబ సభ్యులకు అందజేసి ఆమె సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా అల్లెం అప్పయ్య , ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా.అహ్మద్, డా.మంజుల, డెమో అశోక్ రెడ్డి, స్థానిక పల్లె దవాఖాన వైద్యులు డా.మౌనిక, డా.నివేదిత ,సూపర్వైజర్ రాజయ్య స్థానిక సబ్ సెంటర్ సిస్టర్స్ అనిత కుమారి,సత్యవేద ,గీత , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Kothapally: తృటిలో తప్పిన పెను ప్రమాదం 

Views: 359
Tags:

About The Author

Latest News