Bheemadevarapally: నర్సరీలను సంరక్షించాలి
On

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విద్యాలత
నర్సరీలను సంరక్షించాలి
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విద్యాలత
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
నర్సరీలను సంరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు నీటిని అందించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (ZP CEO) విద్యాలత తెలిపారు. మంగళవారం భీమదేవరపల్లి (Bheemadevarapally), కొత్తపల్లి (kothapally) గ్రామాలలో అధికారులతో నర్సరీలను పరిశీలించారు. నర్సరీలకు అవసరమైన షెడ్ నెట్‌లు, నీటి సదుపాయం కల్పించాలని, మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, పంచాయతీ కార్యదర్శి అనంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Views: 137
Tags:
About The Author
Related Posts
Latest News
21 Apr 2025 21:28:39
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు