Bheemadevarapally: సిటీ పోలీస్ యాక్ట్ అమలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

సిటీ పోలీస్ యాక్ట్ అమలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
భీమదేవరపల్లి, రాజముద్ర డిస్క్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal police commissionerate) పరిధిలో రేపటి నుండి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ (City police act) అమలులో వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు (orders) జారీచేశారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగ్ ర్యాలీలు, ఉరేగింపులను (procession) నిర్వహించడం నిషేధించబడ్డాయి. అలాగే ఎవరైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం (Drinking alcohol in public places) నేరమని, అలాగే వృద్దులు, రోగులతో పాటు, విధ్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు , శబ్ద (Sound polution) కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్‌లను (Dj sounds) వినియోగించడంపై నిషేధాన్ని (Ban) కోనసాగించడం జరుగుతుంది. ఎవరైన మైక్‌లను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పని సరిగా సంబంధిత ఏసిపి అధికారుల నుండి అనుమతులు తీసుకోవాలి అన్నారు.మైక్ కేవలం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాలి అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో మైకులను వినియోగించరాదని, అలాగే హస్పటల్స్ (Hospitals), విద్యాలయాలకు (Schools) వంద మీటర్ల పరిధిలో మైకులను ఏర్పాటు చేయరాదన్నారు.ఈ నిషేధ ఉత్తర్వులు 06-04-25 నుండి తేది05-05-25 వరకు అమలులో వుంటుంది. ఎవరైన ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.