Ghatkesar: ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు మోక్షం.. 50 లక్షలు మంజూరు
14 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఘట్కేసర్ ఫ్లై ఓవర్

ఎట్టకేలకు రూ. 50 లక్షల నిధులు మంజూరు
ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు మోక్షం.. 50 లక్షలు మంజూరు
14 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఘట్కేసర్ ఫ్లై ఓవర్..
ఎట్టకేలకు రూ. 50 లక్షల నిధులు మంజూరు
ఘట్కేసర్, రాజముద్ర వెబ్ డెస్క్:
గత 14 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఘట్కేసర్ ఫ్లై ఓవర్ ( Ghatkesar flyover) పనులు ఇకపై శరవేగంగా ముందుకు సాగనున్నాయి. అయితే మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Chamakura MallaReddy) మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Mallu Bhatti vikramarka)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులను ప్రారంభించాలని డిప్యూటీ సీఎంకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వినతిపత్రం సమర్పించారు. అయితే, మల్లారెడ్డి వినతిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పనులు ప్రారంభించేందుకు రూ.50 లక్షల (Fifty Lakhs) నిధులు (Funds) మంజూరు చేశారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గ (Medchal constituency) ప్రజలు, ఘట్కేసర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.