Bheemadevarapally: ఘోర ప్రమాదం.. పాస్టర్ (Pastor) మృతి 

భీమదేవరపల్లి మండలంలో  కారును ఢీ కొట్టిన లారీ

On
Bheemadevarapally: ఘోర ప్రమాదం.. పాస్టర్ (Pastor) మృతి 

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

ఘోర ప్రమాదం.. పాస్టర్(Pastor)మృతి 

 

Also Read:  Mulkanoor: అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కెన్యా పర్యటన 

-భీమదేవరపల్లి మండలంలో 
కారును ఢీ కొట్టిన లారీ

Hanumakonda-1_V_jpg--442x260-4g

Also Read:  Bheemadevarapally, Mulkanoor: వసంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  మృతుని కుటుంబానికి బియ్యం అందజేత  

-లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం 

Hanumakonda-1-1_V_jpg--442x260-4g

Also Read:  Bheemadevarapally, Kothapally : ఉత్తమ ఆశా అవార్డు గ్రహీత వేల్పుల విజయా

 

-శోకసంద్రంలో పాస్టర్ కుటుంబం 


భీమదేవరపల్లి, రాజముద్ర డిస్క్:

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై(National Highway) గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఓ చర్చి పాస్టర్‌ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగంగా నుజ్జునుజ్జు అయింది.
గోదావరిఖనికి(Godavarikani)చెందిన కనకపుడి కరుణాకర్ కరీంనగర్‌లోని ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ (Hanmakonda) నుంచి కరీంనగర్‌కు తన కారులో బయల్దేరారు. అయితే హుజూరాబాద్ ( Huzurabadh) రహదారిలో రోడ్డు పనులు జరుగుతుండటంతో హుస్నాబాద్ నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో గోపాల్‌పూర్( Gopalpur cross) క్రాసింగ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. కారును డీ కొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో కరుణాకర్‌ అందులోనే ఇరుక్కుపోయారు. లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ (డ్రైవర్) పరారయ్యాడు. కాగా, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు పోలీసులకు, 108కి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతికష్టంపై మృతదేహాన్ని అందులోనుంచి బయటకు తీశారు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, లారీ డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Views: 12
Tags:

About The Author

Latest News