Bheemadevarapally: హుస్నాబాద్ లో ఎస్ యు ఇంజనీరింగ్ కాలేజి మంజూరు
పొన్నంకి ధన్యవాదములు తెలిపిన భీమదేవరపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్

హుస్నాబాద్ లో ఎస్ యు ఇంజనీరింగ్ కాలేజి మంజూరు
పొన్నంకి ధన్యవాదములు తెలిపిన భీమదేవరపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్
భీమదేవరపల్లి, రాజముద్ర డిస్క్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు పట్ల భీమదేవరపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కుల అనిల్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి వల్లే హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ మంజూరైనట్లు వారు తెలిపారు. హుస్నాబాద్ పరిసర ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకైక లక్ష్యం అని అన్నారు.
పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి, లా కాలేజి మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు.