Telangana: తెలంగాణలో ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం

On
Telangana: తెలంగాణలో ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం

తెలంగాణలో ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం

తెలంగాణ, రాజముద్ర డెస్క్:

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు (Ration Card) దారులకు ఏప్రిల్ (April)1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకాన్ని (Scheme) సీఎం రేవంత్ రెడ్డి ఉగాది (Ugadhi)పండుగ రోజున సూర్యాపేట ( Suryapet) జిల్లా హుజూర్ నగర్‌లో (Huzurnagar) లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ( Congres Party) అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్‌కు సీఎం రేవంత్ వస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్న దాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత 

Views: 8
Tags:

About The Author

Latest News