Telangana: ముఖ్యమంత్రి సభకు ముమ్మర ఏర్పాట్లు
• సభా స్టలిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముఖ్యమంత్రి సభకు ముమ్మర ఏర్పాట్లు
సభా స్టలిని పరిశీలించిన
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
హుజూర్ నగర్ రాజముద్ర డెస్క్:
హుజూర్ నగర్ (Huzurnagar) పట్టణంలో ఉగాది( Ugadhi) పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా సన్న బియ్యం(fine Rice) పంపిణి కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(district collector Tejas Nandlal Pawar) అన్నారు. మంగళవారం హుజర్ నగర్ పట్టణంలో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను జిల్లా ఎస్పి నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ సభా జరిగే ప్రాంగణం పరిశీలిస్తూ హెలిప్యాడ్ దిగే వద్ద విద్యుత్ స్టంబాలు తొలగించి ఆ లైన్ లో ఉన్నా విద్యుత్ సరఫరా ను వేరే రూట్ లో సరఫరా చేయాలని , హెలిప్యాడ్ నుండి సభా వేదిక వరకు ఆప్రోచ్ రోడ్డును వేయాలని, బారికేడ్లు నిర్మించాలని తెలిపారు.
విఐపి( VIP) , అధికారుల పార్కింగ్ (Parking )లను పరిశీలించారు.
హెలిప్యాడ్ (Helipad) ను, ఆప్రోచ్ రోడ్లు 27 వ తారీఖు సాయంత్రం లోపు పూర్తి చేయాలని తెలిపారు. ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ (Traffic) సమస్య లేకుండా పలు చోట్ల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలాలకి వెళ్లే రోడ్లలో గుంటలు పూడ్చి,రోలింగ్ ద్వారా చదును చేయాలని, దారి పొడువునా ఏమైనా చెట్ల కొమ్మలు అడ్డు వస్తే తొలగించాలని, పార్కింగ్ లో ప్లడ్ లైట్స్ (Flood lights ) ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ లో రెండు దారులు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి సూచించారు.
తదుపరి హుజూర్ నగర్ ఆర్డీఓ(RDO) కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్, పార్కింగ్, వి ఐ పిలకు ప్రోటోకాల్, సభవేదిక వద్ద తహసీల్దార్ లకి ఇంచార్జి విధులు కేటాయించామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎండకాలం కాబట్టి ప్రజలకోసం చల్లని త్రాగునీరు (Drinking Water), మజ్జిగ ఏర్పాట్లు చేయాలని ప్రతి సెక్టార్ కి ఎంపిడిఓ /ఎంపిఓ ఇంచార్జి గా ఉంటూ పంచాయతీ సెక్రటరీలను సపోర్ట్ గా ఉంచుకుంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో సభకు వచ్చిన ప్రజలకి త్రాగునీరు, మజ్జిగ అందజేయాలని తెలిపారు.అధికారులు ఐడి కార్డులు ధరించాలని అన్నారు. సమాచార శాఖ ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, తహసీల్దార్లు నాగార్జున రెడ్డి,కమలాకర్, మంగా, జ్యోతి, కవిత, సైదులు, సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.