Telangana: సైబర్ నేరగాళ్ళ చెరలో విద్యుత్ వినియోగదారులు
• విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మోసపూరిత కాల్స్ ను, సందేశాలను నమ్మవద్దు

సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి
సైబర్ నేరాల చెరలో విద్యుత్ వినియోగదారులు
- విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మోసపూరిత కాల్స్ ను, సందేశాలను నమ్మవద్దు
- సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి
హైదరాబాద్, రాజముద్ర వెబ్ డెస్క్:
విద్యుత్ వాడకం బిల్లలు, బకాయిల పేరుతో కొంత మంది వ్యక్తులు తమ వినియోగదారులను( Customers) మెసేజ్ (Messages)ల ద్వారా/ ఫోన్ ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు (Electricity Bills ), వాటి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వారిని వెంటనే సంప్రదించాలిసిందిగా ఒక మొబైల్ నెంబర్ ను పంపుతున్నారు. ఆ మెసేజ్ ను నమ్మి ఎవరైనా వారిని సంప్రదిస్తే బ్యాంకు అకౌంట్( Bank Account), డెబిట్ కార్డు(Debit Card) వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుండి నగదును విత్ డ్రా(With Draw )చేసుకుంటూ మోసగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, కనుక విద్యుత్ వినియోగదారులు, ప్రజలు ఇలాంటి మోసపూరిత మెసేజ్ లు నమ్మి మోసపోవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్(Managing Director)ముషారఫ్ ఫరూఖి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
TGSPDCL పంపే సందేశాలలో విభాగం పేరు, USC/సర్వీస్ నంబర్, వినియోగదారుని పేరు & బిల్లు మొత్తం ఉంటాయి, TGSPDCL ఎప్పుడూ మొబైల్ నంబర్ నుండి సందేశాలు పంపదన్నారు.
TGSPDCL ఉద్యోగులు చెల్లింపు రసీదు తప్ప బ్యాంక్ ఖాతా/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్( Credit, Debit Cards )వివరాలను ఎన్నడూ సేకరించరు. సంస్థ బిల్లుల చెల్లింపు కోసం SMS/సందేశం ద్వారా ఎటువంటి వెబ్‌సైట్ లింక్‌లను పంపదు. విద్యుత్ వాడకం బిల్లులు, బకాయిల వివరాలను విద్యుత్ బిల్లు ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుంది. వినియోగదారులు సంస్థ వెబ్‌సైట్(Website) www.tgsouthernpower.org లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుత వినియోగ బిల్లులు, బకాయిల సమాచారాన్ని పొందవచ్చు. అంతేగాక సంస్థ రాత్రిపూట/అర్ధరాత్రి విద్యుత్ సరఫరాను నిలిపివేయదన్నారు.
విద్యుత్ వినియోగదారులు బ్యాంక్ ఖాతా/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం అనుమానాస్పద లింక్‌లను అనుసరించవద్దని ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.