Valigonda:బునాది గాని కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలి

On
Valigonda:బునాది గాని కాలువ పనులు వెంటనే  పూర్తి చేయాలి

కాళేశ్వరం కాలువ ద్వారా గోదావరి జలాలను బునాది గాని కాలువలోకి మళ్ళించాలి

 

రాజముద్ర వెబ్ డెస్క్:

Also Read:  Telangana: హైదరాబాద్‌లో మరో ఘోరం.. 

 కాలేశ్వరం(kaaleshwaram)కాలువ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగు నిరంధించాలని సిపిఎం(cpm )జిల్లా కార్యదర్శి(district  secretary)  వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి(mandal secretary)సిర్పంగి స్వామిలు డిమాండ్ చేశారు.సోమవారం రోజున పునాది గాని కాల్వపనులను ను వెంటనే ప్రారంభించి పూర్తి చేసి కాలేశ్వరం కాలువ ద్వారా గోదావరి జలాలను బునాది గాని కాలువలోకి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మళ్లించాలని ప్రస్తుతం మండల వ్యాప్తంగా ఎండిపోయిన 1000 ఎకరాల పంట పొలాలకు చెందిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి గ్రామంలో బైక్ యాత్ర ప్రారంభించి మొగిలిపాక, కేర్చిపళ్లి, పులిగిల్ల సుంకిశాల మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు చేరుకొని అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముట్టడిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బునాది గాని కాలువ పనులు ఉన్నాయని పాలకులు ఎందరో మారిన కాల్వ తీరు మాత్రం మారలేదన్నారు 2006లో శంకుస్థాపన చేసి 18 ఏళ్లు గడుస్తున్న నేటికీ అతిగతి లేకపోవడం రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితులు దాపురించయన్నారు బీబీనగర్ మండలం మక్త అనంతరం నుండి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు 98.64 కిలోమీటర్ల కాలువ తీయాల్సి ఉండగా కేవలం నేటికీ 34 కిలోమీటర్లు మాత్రమే పై పైన తవ్వి వదిలేశరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఐదు సార్లు ప్రభుత్వాలు మారిన కాల్వ మాత్రం పూర్తి చేసి రైతులకు నీరు అందించిన పరిస్థితులు లేవన్నారు ఇటీవల కాలంలో 260 కోట్లతో కాల్వ పూర్తి కోసం ప్రతిపాదనలు పంపినట్టు బడ్జెట్లో నిధులు విడుదల చేస్తున్నట్లు జరిగిన ఇది ప్రచారానికి తప్ప కార్యచరణ చేపట్టలేకపోయారన్నారు వలిగొండ మండలంలో 10 గ్రామాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ నీరందక ఈ సంవత్సరం సుమారు మండల వ్యాప్తంగా వెయ్యి ఎకరాల పంట నష్టం జరిగిందని పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 30 వేల రూపాయల పరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బునాది గాని కాలువ పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిచేయాలని ఈ కాలువ పై భాగం నుండి వెళ్తున్న కాలేశ్వరం కాలువ ఎర్రంబెల్లి ఏదుమోట్ల బావి సరిహద్దులో తూమును ఏర్పాటు చేసి బునాది గాని కాలువలోకి గోదావరి జలాలను మళ్లించాలని పహిల్వాన్ పురం చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు సాగునీరును అందించాలని గోకారం చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చి నార్కట్పల్లి మండలం వరకు గోదావరి జలాలను అందించాలని వలిగొండ చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చి గోదావరి జలాలతో నింపి మోత్కూరు మండలం పాలడుగు వరకు గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించి పూర్తి చేయాలని భువనగిరి తుంగతుర్తి నకిరేకల్ ఎమ్మెల్యేలు పనులు పూర్తి చేసేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించేందుకు శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం, కందడి సత్తిరెడ్డి,వాకిటి వెంకటరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు మొగిలిపాక గోపాల్, సిపిఎం మండల కమిటీ సభ్యులు చీర్క శ్రీశైలంరెడ్డి, కొండే కిష్టయ్య,కల్కూరి రామచందర్,కర్ణకంటి యాదయ్య,బుగ్గ చంద్రమౌళి, దుబ్బ లింగం,కవిడే సురేష్, కల్కూరి ముత్యాలు, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,సిపిఎం తుర్కపల్లి గ్రామ శాఖ కార్యదర్శి పలుసం స్వామి, నాయకులు రాదారపు మల్లేశం, తుమ్మల సంజీవరెడ్డి,దొడ్డి బిక్షపతి, పల్సం లింగం,చేగురి నగేష్,వేముల నాగరాజు, ఏటెల్లి నరసింహ, లోడే మల్లేశం, బొక్క వెంకట్ రెడ్డి,కొండూరు సత్తయ్య,గూడూరు బుచ్చిరెడ్డి,చేగురి నరసింహ,పాక జయ రాములు,జక్కా రాఘవ రెడ్డి, నారి రామస్వామి,పోలేపల్లి స్వామి,మారబోయిన ముత్యాలు,వరికుప్పల శంకరయ్య, బందారపు ధనంజయ, వీరస్వామి, వేముల అమరేందర్, ఈర్ల రమేష్,దయ్యాల నరసింహ,మైసొల్ల నరేందర్, వేముల లక్ష్మయ్య, బత్తుల నరసింహ, పెద్ద బోయిన భీమరాజు, వడ్డెమాని మధు, సందెల శ్రీకాంత్, మారబోయిన ప్రశాంత్, వేముల నరసింహ,పోలేపల్లి ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Telangana: సైబర్ నేరగాళ్ళ చెరలో విద్యుత్ వినియోగదారులు

Views: 6
Tags:

About The Author

Latest News