Bheemadevarapally, Mulkanoor: అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం 

On
Bheemadevarapally, Mulkanoor: అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం 

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ అంబేద్కర్ సంఘం కన్వీనర్  బొల్లంపల్లి రాజు ఆధ్వర్యంలో సోమవారం నాడు ముల్కనూర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించద్దని డిమాండ్ చేశారు. సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు అన్ని గ్రామాలలో సెంటర్ పాయింట్ లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నందున ముల్కనూరులో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని యధాతధంగా అలానే ఉంచాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, అధికార ప్రతినిధి తూముల సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల  చేరాలు, మండల  జేఏసీ చైర్మన్ డ్యాగాల సారయ్య, మాజీ సమ్మక్క సారలమ్మ చైర్మన్ మాడుగుల అశోక్, మండల కన్వీనర్ ఎల్తూరి ప్రేమ్ రాజు, కన్వీనర్ దాట్ల రాజు, బి ఎస్ పి మండల అధ్యక్షుడు బుసమల్ల రాజు, తాడూరి చిరంజీవి , మాడుగుల పోచయ్య , గొర్రె సదానందం, గజ్జెల రమేష్, పోగుల శ్రీకాంత్, గడిపే బిక్షపతి, వేముల జగదీష్, చిట్యాల కిరణ్, సీతంపేట భాస్కర్, పాపక్క సీతక్క దళిత బహుజన నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో తొలగించవద్దని తొలగిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

Also Read:  Valigonda: ఎండిన పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా

Views: 332
Tags:

About The Author

Latest News