Telangana: బెట్టింగ్స్ మానుకోండి... జీవితాలను నాశనం చేసుకోకండి..

Telangana: బెట్టింగ్స్ మానుకోండి... జీవితాలను నాశనం చేసుకోకండి..
తెలంగాణ, రాజముద్ర డెస్క్:
బెట్టింగ్స్(Bettings)వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి అని తెలంగాణ పోలీస్ తెలిపారు. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. ఐసీసీ(International Cricket Club)నిర్వహించే మ్యాచులు క్రికెట్(Cricket) ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక ఫక్తు వ్యాపారం(Business). చిన్న చిన్న చేపలను అమాంతం మింగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక పెద్దలు మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి. లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది. మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండి. ఐపీల్(IPL) క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఐపీల్(IPL) క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా ఐపీల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ (police) వారికీ సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.