Bheemadevarapally, Mulkanoor: బీసీలకు జోష్ పెంచిన రేవంత్ సర్కార్
సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటానికి పాలాభిషేకం

బీసీలకు జోష్ పెంచిన రేవంత్ సర్కార్
-సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటానికి పాలాభిషేకం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు స్వాగతిస్తూ భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య,యూత్ అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముల్కనూర్ (Mulkanoor) అంబేద్కర్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. దాంతో, మంగళవారం వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఏ వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.