Bheemadevarapally, Mulkanoor: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం

ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల హాస్పిటల్ కెటాయించాలి 

On
Bheemadevarapally, Mulkanoor: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం

బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్

హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం

-ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల హాస్పిటల్ కెటాయించాలి 

-బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ముల్కనూరు(Mulkanoor) బస్టాండ్ కూడలిలో భారతీయ జనతా పార్టీ(BJP) మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ  మూడు మండలాలు అక్కన్నపేట్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి  మండలాలకు రవాణా సౌకర్యం కలిగివున్న  భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో 30 పడకల ఆసుపత్రి (Hospital) ను వెంటనే  కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఆస్పత్రి కట్టించకుండా కాలయాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి కనీసం పేద ప్రజలకు సరైన వైద్య సదుపాయలు అందించడం లేదు.  30 రోజుల్లో 30 పడకల హాస్పిటల్ కేటాయించకపోతే  హుస్నాబాద్ ఎమ్మెల్యే(MLA) క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం అని ఈ సందర్భంగా బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమరయ్య, పైడిపల్లి పృధ్విరాజ్ గౌడ్,గండు సారయ్య,గుండెల్లి సదానందం, తీగల రాజు, దొంగల వేణు, లక్కిరెడ్డి మల్లారెడ్డి, దొంగల రాణా ప్రతాప్, బొజ్జపూరి  పృథ్వీరాజ్, బైరి సదానందం,సిద్ధమళ్ళ రమేష్, పోడేటి బిక్షపతి,ప్రదీప్ రెడ్డి, రాంనగర్ శ్రీకాంత్,సాయి యాదవ్, నవీన్,అలుగు భాస్కర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Chivemlla: మహిళ మెడలో నుండి బంగారం చోరీ చేసిన దుండగుడు

Views: 235
Tags:

About The Author

Latest News

Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు బీబీనగర్, రాజముద్ర న్యూస్: బీబీనగర్(Beebinagar) తహశీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు...
Telangana, వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ ఎందుకో తెలుసా? 
Telangana, Rajiv Yuva Vikas: రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు
Bheemadevarapally: 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
Bheemadevarapally, Mulkanoor: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత 
Bheemadevarapally, Mulkanoor: బీసీలకు జోష్ పెంచిన రేవంత్ సర్కార్ 
Bheemadevarapally, Mulkanoor: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం