Bheemadevarapally, Gatlanarsingapur: విద్యార్థులు పరీక్షల్లో మానసిక ఒత్తిడికి గురికావద్దు
-డాక్టర్ ప్రహసిత్
On

విద్యార్థులు పరీక్షల్లో మానసిక ఒత్తిడికి గురికావద్దు
-డాక్టర్ ప్రహసిత్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
విద్యార్థులు(Students) పరీక్షల్లో మానసిక ఒత్తిడికి గురికావద్దని, దేశ ప్రగతికి మీరే మూలస్తంభాలని డాక్టర్ ప్రహసిత్ తెలిపారు. మంగళవారం గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి పరీక్షలో భయం అనే అంశం పైన అవగాహన (Awareness) కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తే ప్రగతి సాధిస్తారన్నారు. విద్యపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. త్వరలోనే వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో మానసిక ఒత్తిడికి (Stress) లోను కావద్దని తెలిపారు. సకాలంలో నిద్రపోవాలని, వ్యాయామం (Exercise) చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రుబీనా, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 134
Tags:
About The Author
Related Posts
Latest News
22 Mar 2025 12:42:22
ఎల్కతుర్తి సీఐ పులి రమేష్