Bheemadevarapally:రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

On
Bheemadevarapally:రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

ఎల్కతుర్తి సీఐ పులి రమేష్

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

-ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

 -ఎల్కతుర్తి సీఐ పులి రమేష్

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ అన్నారు. ఇటీవల మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సీఐ సూచించారు. సీఐ రాజముద్ర విలేకరితో మాట్లాడుతూ.. మండలంలోని యువత గంజాయి, మద్యంకు బానిస కావద్దని వాహనాలను అతివేగంగా నడపవద్దని సీఐ సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. వాహన చోదకులు తప్పనిసరిగా సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అవసరమని, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పోలీస్ కళాబృందం ద్వారా పలు గ్రామాల్లో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, తదితర అంశాలపై ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, వంగర ఎస్సై దివ్య ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము అన్నారు.

Also Read:  Choutppal: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి 

Views: 181
Tags:

About The Author

Latest News