Telangana, Rajiv Yuva Vikas: రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు
రేషన్ కార్డ్ లేకపోవడంతో అర్హత కోల్పోతున్న యువత

ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలు మార్చాలి
Rajiv Yuva Vikas: రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు
- రేషన్ కార్డ్ లేకపోవడంతో అర్హత కోల్పోతున్న యువత
-ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలు మార్చాలి
-రిషారియా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి
తెలంగాణ, రాజముద్ర వెబ్ డెస్క్:
రాజీవ్ యువ వికాస్(Rajiv yuva vikas) పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు పడుతున్నారు అని రిషారియా ఫౌండేషన్(Rishariya Foundation) మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి(Priyadharshini Medi)అన్నారు. గత బిఆర్ఎస్ (BRS)ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులకు అవకాశం కల్పించకపోవడంతో 12 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు (Ration Cards) దరఖాస్తు (Apply)చేసుకునే అవకాశం లేక పెళ్లిళ్లు జరిగి వేరుగా నివాసం ఉంటున్న ఎందరో యువకులు ఇంకా తల్లిదండ్రులు రేషన్ కార్డులోనే కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో నిబంధనలు ప్రకారం పాత రేషన్ కార్డులు డిలీట్ (Delete) అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండడంతో పలువురు యువకులు డిలీట్ ఆప్షన్ ద్వారా పాత రేషన్ కార్డులు డిలీట్ అయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యువతకు చేయూతనందించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ (Rajiv Yuva Vikas) పథకాన్ని తీసుకొని వచ్చింది.ఎంతో ఆశగా శిక్షణతో పాటుగా సబ్సిడీ రుణాలు లభిస్తాయని ఉపాధి పొందవచ్చు అని ఆశతో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఈ సేవా సెంటర్లకు వెళ్తే అక్కడ నిర్వాహకులు వివరాలు నమోదు చేసిన క్రమంలో రేషన్ కార్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంతకుముందు పాత కార్డు డిలీట్ అయిన కారణంగా ఆ నెంబర్ కొడితే దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పడంతో యువకలు (Youth) చాలా మంది నిరుత్సాహ పడుతున్నారు.
వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రియదర్శిని మేడి సూచించారు.