Bheemadevarapally: 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్

On
Bheemadevarapally: 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

-వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్


భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

వరంగల్ పోలీస్ కమీషనరేట్  పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే 

పదవ తరగతి  పరీక్షల సందర్భంగా   పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, మూసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు  పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత

Views: 58
Tags:

About The Author

Latest News

Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు Beebinagar, తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు బీబీనగర్, రాజముద్ర న్యూస్: బీబీనగర్(Beebinagar) తహశీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు...
Telangana, వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ ఎందుకో తెలుసా? 
Telangana, Rajiv Yuva Vikas: రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ యువతకు చిక్కులు
Bheemadevarapally: 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
Bheemadevarapally, Mulkanoor: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత 
Bheemadevarapally, Mulkanoor: బీసీలకు జోష్ పెంచిన రేవంత్ సర్కార్ 
Bheemadevarapally, Mulkanoor: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం