Bheemadevarapally, Mulkanoor: పేదవాడికీ కడుపు నిండా అన్నం
ముల్కనూరులో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

పేదవాడికీ కడుపు నిండా అన్నం
ముల్కనూరులో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ (Mulkanoor) గ్రామంలోని రేషన్ షాపుల (Ration Shops ) నుండి లబ్ధిదారులకు సన్న బియ్యం (Fine Rice) పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కార్డు కలిగిన లబ్ధిదారుల కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు షాపుల ద్వారా పంపిణీ అవుతున్న దొడ్డు బియ్యం అనేకమంది తినకుండా మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)నాయకులు మాట్లాడుతూ.. సన్న బియ్యం సరఫరా వలన పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది. పేదోళ్లకు కడుపునిండా తిండి పెట్టేందుకే తమ ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారుల కోసం సన్నబియ్యం పథకాన్ని ఈ ఉగాది పర్వదినాన ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, సరోజినీ మేడం, మాజీ సర్పంచ్ మంగ రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గనబోయిన కొమురయ్య, కొలుగూరి రాజు, సుదర్శన్ రెడ్డి, గుడికందుల సమ్మయ్య, ఇట్టబోయిన నాగరాజు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు గుడికందుల రాజు, హుస్నాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ పోగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.