Bheemadevarapally, Mulkanoor: నరేంద్రమోడీ ఫోటో పెట్టకుంటే నిరసనలు చేస్తాం
అధికారం ఉందని ప్రజలను మభ్య పెట్టడం కరెక్ట్ కాదు

బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్
నరేంద్రమోడీ ఫోటో పెట్టకుంటే నిరసనలు చేస్తాం
-అధికారం ఉందని ప్రజలను మభ్య పెట్టడం కరెక్ట్ కాదు
-తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వింత రాజకీయం చేస్తుంది
-బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
రేషన్ షాపుల( Ration Shops)ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi )ఫోటో ఏర్పాటు చేయాలని, లేనియెడల నిరసనలు చేస్తామని భీమదేవరపల్లి మండల బిజెపి(BJP) అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వింత రాజకీయం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క కిలో బియ్యానికి 40 రూపాయలు వెచ్చించి ప్రజలకు అందిస్తున్నా నరేంద్ర మోడీ ఫోటో పెట్టలేదు అన్నారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోలను పెట్టడం చాలా బాధాకరం అన్నారు. భీమదేవరపల్లి మండలంలో రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాలని మండల ఎమ్మార్వో ని అడగగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని తెలిపారు. రేషన్ డీలర్లతో మాట్లాడి రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటో పెట్టి ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి తప్ప అధికారం ఉంది కదా.. అని ప్రజలను మభ్య పెట్టడం కరెక్ట్ కాదు అని అన్నారు. రాబోయే రోజులలో అన్ని గ్రామాల ముందు నరేంద్ర మోడీ ఫోటోని ప్రభుత్వం కేటాయించకపోతే భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ద్వారా అన్ని రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటో పెడతామని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృధ్విరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు దొంగల కొమరయ్య, ప్రధాన కార్యదర్శి గుండెల్లి సదానందం,మండల ఉపాధ్యక్షులు దొంగల వేణు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు దొంగల రాణా ప్రతాప్, శక్తి కేంద్రం ఇన్చార్జులు బైరి సదానందం, శనిగరపు ఐలయ్య, కాలేరు వికాస్, బొల్లంపల్లి శ్యామ్, బొజ్జపురి పృథ్వీరాజ్, కత్తుల విజయ్, పట్ల అఖిల్ తదితరుల పాల్గొన్నారు.