Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో ఘనంగా ఎస్ ఆర్ కె స్కూల్ వార్షికోత్సవం
ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

ఆకట్టుకున్న పిల్లల నృత్యాలు
ముల్కనూర్ లో ఘనంగా ఎస్ ఆర్ కె స్కూల్ వార్షికోత్సవం
ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
ఆకట్టుకున్న పిల్లల నృత్యాలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో గల ఎస్ ఆర్ కే ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ 15 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొని మొదటగా జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమన్ని ప్రారంభించారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తమ లక్షాలని నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలని చేరుకోవాలని అన్నారు. క్రమశిక్షణతో రానించి పాఠశాల పేరు నిలబెట్టాలని సూచించారు. అలాగే క్రీడలు, విద్య ఇతర రంగాలలో రాణిస్తే గుర్తింపు లభిస్తుంది అని అన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరం పూర్తి అయినా విద్యార్థునులకి సర్టిఫికెట్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, విశిష్ట అతిధిలుగా యాదగిరి శేఖర్ రావు (TRSMA State chief adviser), అలిగిరెడ్డి సుదర్శన్ రెడ్డి( AKVR RDC కరస్పాండంట్), పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, తల్లి దండ్రులు, ముల్కనూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.