Bheemadevarapally: సరైన ధ్రువపత్రాలతో రండి వాహనాలను తీసుకెళ్లండి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
సరైన ధ్రువపత్రాలతో రండి వాహనాలను తీసుకెళ్లండి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
సరైన ధృవపత్రాలతో వచ్చి మీ వాహనాలను (Vehicles) తీసుకెళ్లండని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ( Warangal police commissioner rate) వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సి.ఆర్ పి. ఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సబంధిత వాహన యజమానులకు నోటీసులు(Notice)కూడా పంపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేయనున్నారు. మరింత సమాచారం (Help line Numbers) 8712685143, 8712685158, 8712584557 యజమానులు సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.