Boduppal Muncipal Corporation: బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
• నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్?
On

కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందించిన 24 మంది కార్పొరేటర్లు
Boduppal municipal corporation: బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టారు.
కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందించిన 24 మంది కార్పొరేటర్లు
నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్?
రాజముద్ర, వెబ్ డెస్క్: గత మూడు, నాలుగు నెలలుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం దోబూచులాడుతూ ఎట్టకేలకు శుక్రవారం కాంగ్రెస్ కార్పొరేటర్ల వ్యూహం ఫలించింది. బోడుప్పల్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 24 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందించారు. తాజాగా బోడుప్పల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ నిన్నటి మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని పలువురి అభిప్రాయం. గత నాలుగున్నర సంవత్సరాలుగా మేయర్ గా కొనసాగిన సామల బుచ్చిరెడ్డి ఎట్టకేలకు పీఠాన్ని వీడక తప్పట్లేదు. బిఆర్ఎస్ నగర అధ్యక్షులు మంద సంజీవరెడ్డి మేయర్ కు షాడో నేతగా పనిచేస్తూ కార్పోరేటర్లందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగించారు. అయినా బిఆర్ఎస్ కార్పొరేటర్లు కారు గుర్తు పార్టీని వదిలి హస్తం పార్టీలో చేరారు.
నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్?
బోడుప్పల్ కార్పొరేషన్ లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 28 మంది ఉండగా ఇప్పుడు 24 మంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 24 మంది శుక్రవారం కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందించారు. కలెక్టర్ నుండి ప్రకటన వెలువడగానే నూతన మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు నూతన మేయర్ గా యువ నాయకులు, 6వ డివిజన్ కార్పొరేటర్, తోటకూర వజ్రేష్ యాదవ్ కుమారుడు తోటకూర అజయ్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది కార్పొరేటర్లు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బోడుప్పల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ గా 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పీఠాన్ని అధిరోహించేందుకు చక్రం తిప్పుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఒకవేళ మేయర్ బీసీ వర్గానికి చెందిన వాడు కనుక డిప్యూటీ మేయర్ సింగిరెడ్డి పద్మా రెడ్డికి దక్కవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బోడుప్పల్ కార్పొరేషన్ లో టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పంతం నెగ్గించుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Views: 744
Tags:
About The Author
Related Posts
Latest News
21 Apr 2025 21:28:39
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు