Bheemadevarapally, Vangara: వంగర పిహెచ్సి ని సందర్శించిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ మెడికోస్ 

On
Bheemadevarapally, Vangara: వంగర పిహెచ్సి ని సందర్శించిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ మెడికోస్ 

వంగర పిహెచ్సి ని సందర్శించిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ మెడికోస్ 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలం లోని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం నాడు  ఫాదర్ కొలంబొ మెడికల్ కాలేజ్ మెడికోస్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, మందుల గురించి, ఇతర సదుపాయాల గురించి డాక్టర్ రెహమాన్, డాక్టర్ రూబీనా వైద్య విద్యార్థులకు వివరించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని వైద్య విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ టి.తరుణ్ రెడ్డి , డాక్టర్ నజియా, డాక్టర్ మధుసుధన్, డాక్టర్ కే.బాలు, డాక్టర్ గీతాంజలి, రెనా తదితరులు సందర్శించారు.IMG-20250407-WA0259IMG-20250407-WA0260

Also Read:  అబద్ధపు హామీలతో మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు

Views: 236
Tags:

About The Author

Latest News