CBI Raids: సంధ్య ఆక్వా పరిశ్రమలో  సీబీఐ దాడులు..

• 25 కేజీల డ్రగ్స్ స్వాధీనం

On
CBI Raids:  సంధ్య ఆక్వా పరిశ్రమలో  సీబీఐ దాడులు..

Drugs:  సంధ్య ఆక్వా పరిశ్రమలో  సీబీఐ దాడులు చేసి 25 కేజీల డ్రగ్స్ ను  స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేశారు.

 

ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం.

 

బ్రెజిల్‌ నుంచి 25వేల కేజీల మాదకద్రవ్యాల కంటెయినర్‌ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో బుక్‌ అయి విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌పోల్‌ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Views: 9
Tags:

About The Author

Related Posts

Latest News