Pawan Kalyan: జనసేనాని ర్యాలీలో జాతీయ జెండా ఈసీకి ఫిర్యాదు - పవన్ పై చర్యలకు డిమాండ్

Pawan Kalyan: జనసేనాని ర్యాలీలో జాతీయ జెండా ను చేత పట్టుకొని నామినేషన్ దాఖలకు బయలుదేరారు. జాతీయ జెండా పట్టుకోవడం చిట్ట విరుద్ధ చర్యాన్ని ఈసీకి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజముద్ర, వెబ్ డెస్క్:
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో టిడిపి,బిజెపి, జనసేన కూటమి పార్టీల జెండాలతోపాటు జాతీయ జెండాలను ప్రదర్శించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా,దేశ సమగ్రతకు చిహ్నమైన జాతీయ పతాకాన్ని ఎన్నికలలో రాజకీయ పార్టీల జెండాల తో కలిపి ప్రదర్శించడాన్ని బాపట్ల జిల్లాకు చెందిన ఎన్.నాగార్జునరెడ్డి తప్పుబట్టారు.
పవన్ ర్యాలీని ప్రసార,మద్యామాలల్లో చూసిన నాగార్జున రెడ్డి ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు.దీంతో భారత ఎన్నికల ప్రక్రియను ఉల్లంఘించి, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పవన్ కల్యాణ్ పైనా, అందుకు సహకరించిన వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీడియో క్లిప్పింగ్స్, ఫొటోలతో సహా ఆధారాలను ఆయన ఈసీకి అందజేశారు.