Private Schools Harassment: విద్యార్థులను భయాందోళనకు గురి చేయవద్దు
• ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఎండలో నిలబెట్టి, తోటి విద్యార్థుల ముందు అవమానపరిచిన ఉపాధ్యాయులు
On

అవమానాలు భరించలేక మనోవేదనకు గురవుతున్న చిన్నారులు
ఇదేమిటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులపై కూడా శివాలెత్తిపోయిన సదరు స్కూల్ టీచర్
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం
Private Schools: ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఫీజులు చెల్లించలేదని చిన్నారులను దారుణంగా దండిస్తున్నారు. రోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ ప్రైవేట్ స్కూల్లో టీచర్ రెచ్చిపోయారు. విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించారు. ఫీజు చెల్లించలేదనే ఒక కారణంతో తోటి విద్యార్థులు ముందు అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నోటికి వచ్చినట్లు దూషించడం, ఆపై విద్యార్థులను మండుటెండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెళ్లి ప్రశ్నించగా వారిపై కూడా ఇష్టానుసారంగా వ్యవహరించిన సదరు టీచర్ వారిని కూడా నోటికి వచ్చినట్లు దూషించడం జరిగింది.
వివరాల్లోకెళ్తే...ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ స్కూల్ లో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలను స్కూల్ యాజమాన్యం నరకం చూపిస్తోందనేది గత కొన్నేళ్లుగా నడుస్తున్న చర్చ. అయితే తాజాగా వెలుగు చూసిన మరో ఘటనతో సెయింట్ జేవియర్ స్కూల్ యొక్క బాగోతం బయటపడింది. ఈ స్కూల్లో అకౌంటెంట్, సోషల్ టీచర్ గా పనిచేస్తున్న జ్యోతి అనే ఉపాధ్యాయురాలు సమయానికి ఫీజు చెల్లించని విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ వారిని మానసికంగా కుంగిపోయేలా దూషిస్తూ, తోటి వారి ముందు అవహేళన చేస్తూ, అవమానాలకు గురి చేస్తూ కనీసం పసిపిల్లలు అనే కనికరం కూడా లేకుండా మండుటెండలో నిలబెట్టి తనలోని రాక్షసత్వాన్ని బయట పెట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు సెయింట్ జేవియర్ స్కూలుకు వెళ్లి అకౌంటెంట్ జ్యోతి అనే టీచర్ ను పిల్లల పట్ల మీరు వ్యవహరించిన విధానం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించిన వారిపై కూడా నోటికి వచ్చినట్లు దూషిస్తూ సదరు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.
ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తాం అని చెప్పిన తల్లిదండ్రులపై విరుచుకుపడి ఇప్పటికే రెండుసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లాను, పలుమార్లు వార్తల్లోకి ఎక్కాను అయినా నన్ను ఎవరు ఏమి చేయలేకపోయారు. ఆఫ్ట్రాల్ నువ్వు ఎంత నా ముందు అంటూ మీ దిక్కున చోట చెప్పుకోపోండి అనే సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు సదరు విద్యార్థుల తల్లిదండ్రులు. ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరే విధంగా తీర్చిదిద్ది విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక టీచర్ విద్యార్థుల పట్ల, ప్రశ్నించిన వారి తల్లిదండ్రుల పట్ల అమానుషంగా వ్యవహరిచడమేమిటి పసిపిల్లల పట్ల ఎంతో ఉదార గుణాన్ని చూపించాల్సిన టీచర్ ఇంత కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నా, గతంలోనూ పలుమార్లు ఈమె పై ఆరోపణలు వచ్చినా కూడా ఈమె పై చర్యలు తీసుకోకుండా స్కూల్ యాజమాన్యం, ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఇంకా అలానే కొనసాగించడం స్థానికంగా చర్చకి దారితీస్తోంది..ఏది ఏమైనా పవిత్ర దేవాలయం లాంటి పాఠశాలలో ఇలాంటివారిని కొనసాగించడం వలన చిన్నారులు లోలోపల నరకయాతన పడటమే కాకుండా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కావున ఈ విషయంపై తక్షణమే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎవరైతే పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న జ్యోతి అనే ఉపాధ్యాయురాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Views: 10
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి