SBI BANK: ఎస్బిఐ బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు గోల్ మాల్
• బ్యాంకు మేనేజర్లే కుంభకోణాలకు ప్రధాన సూత్రధారులు
On

రాజముద్ర, వెబ్ డెస్క్: ఎస్బిఐ బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినా సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్లే కుంభకోణాలకు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.
కస్టమర్ల డబ్బులను కాపాడాల్సిన బ్యాంకు మేనేజర్లే కుంభకోణాలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది. తాజాగా ఎస్బిఐ బ్యాంకులో సుమారు 2 కోట్ల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సూర్యాపేట ఎస్బిఐ బ్యాంక్ కుంభకోణం మరువక ముందే ఈ కుంభకోణం బయటపడింది. వివరాల్లోకి వెళితే... నూతనకల్ మండలం తాళ్ల సింగారం ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ చేసిన కుంభకోణం బయటకు వచ్చింది. బ్యాంకు సమీపంలో గల ఆధార్ కార్డు నిర్వాహకులు, బ్యాంకు అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఎఫ్ ఓ ఎస్ నకిలీ ధ్రువపత్రాలతో సంభావన సంఘాలు, వ్యవసాయ రుణాలను మేనేజర్ హరిప్రసాద్ దాదాపుగా 2 కోట్ల రూపాయలను అక్రమంగా ఖాతాదారుల పేరిట తీసుకొని, తన సమీప బంధువుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ప్రస్తుత ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల సూర్యాపేట ఎస్బిఐ బ్యాంకు మాజీ మేనేజర్ షేక్ సైదులు వినియోగదారుల పేరిట వారికి తెలియకుండా లోన్లు తీశాడు. బాధితుడు శ్యామ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సైదులు పనిచేసిన బ్యాంకులలో కూడా కస్టమర్లకు తెలియకుండానే 4.5 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నట్లుగా రుజువైంది. షేక్ సైదులు ఇంకా ఎంతమందిపై రుణాలు తీసుకున్నాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Views: 12
Tags:
About The Author
Related Posts
Latest News
27 Mar 2025 17:48:14
సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖి