Rid of Tuberculosis: క్షయ వ్యాధిని తరిమి కొట్టడం ఎలా..

• మార్చి 24 అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవం

On
Rid of Tuberculosis: క్షయ వ్యాధిని తరిమి కొట్టడం ఎలా..

How to get Rid of Tuberculosis: 
డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త 24 మార్చి 1882లో క్షయ వ్యాధికి కారణమయ్యే బాక్టీరియం ను కనుగొని ప్రకటించిన రోజును పురస్కరించుకొని  మార్చి 24వ తేదీని ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంగా ప్రతీ సంవత్సరం ఒక్కో థీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అవును..! మనం టీబీని అంతం చేయగలం! అనేది ఈ సంవత్సరం థీమ్. 1882 నుండి ఈ వ్యాధిని నిర్ధారించి నయం చేయడానికి ఒక మార్గం లభించింది.
 
వ్యాధి సోకే తీరు:
 
క్షయ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియ వల్ల వస్తుంది. ఇది తరచుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మివేసినప్పుడు ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకుతుంది. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకడానికి వ్యాధి కారక సూక్ష్మక్రిములను మాత్రమే పీల్చాలి.
 
ప్రపంచలో పరిస్థితి:
 
ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి మంది ప్రజలు క్షయవ్యాధి బారిన పడుతున్నారు.15 లక్షలు మంది మరణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అంటు వ్యాధులతో మరణించే జబ్బులలో అగ్ర స్థానంలో ఉంది. ఈ వ్యాధి ఎక్కువగా మధ్య ఆదాయ దేశాలలో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి మంది ప్రజలు క్షయవ్యాధి బారిన పడుతున్నారు.15 లక్షలు మంది మరణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అంటు వ్యాధులతో మరణించే జబ్బులలో అగ్ర స్థానంలో ఉంది. ఈ వ్యాధి ఎక్కువగా మధ్య ఆదాయ దేశాలలో కనిపిస్తుంది. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా దేశాలలో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. హెచ్‌ఐవి, పోషకాహార లోపం, మధుమేహం, తక్కువ వ్యాధి రోగనిరోధక శక్తి ఉన్న వారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ క్షయ నివేదిక 2023 ప్రకారం 192 దేశాలలో 2022లో 75 లక్షల మంది ప్రజలు క్షయతో బాధపడుతున్నారు. 1995 నుండి ఇప్పటి వరకు నమోదైన గణాంకాలలో ఇదే అత్యధికం..సంవత్సరానికి 100,000 జనాభాకు నమోదైన కొత్త కేసులును సంభవం రేటు అంటారు. ఈ రేటు 2020 మరియు 2022 మధ్య 3.9% పెరిగింది. 
 
మన దేశంలో పరిస్థితి:
 
మనదేశంలో 2022 లో 2 28.2 లక్షలు కేసులు నమోదయ్యాయి. కేసు, మరణాల నిష్పత్తి 12 శాతంగా ఉంది. మరణించిన 3,42,000 లలో హెచ్ ఐ వి (H I V) వారు 3,31,000 మంది హెచ్ఐవి ఉన్నవారు 11,000 మంది ఉన్నారు. క్షయ వ్యాధికి చికిత్స తీసుకున్న వారు 80 శాతంగా ఉంది. ఇది ముందరి సంవత్సరం కంటే 19 శాతం ఎక్కువ. దేశం యొక్క ప్రయత్నాల ఫలితంగా 2022లో ఈ వ్యాధి సోకినవారు 2015 కంటే 16% తగ్గింది. ప్రపంచ సగటు 8.7 శాతం కంటే  రెండింతలు తగ్గడం గమనించదగ్గ విషయం. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఇదే కాలంలో మరణాలు కూడా 18% తగ్గాయి.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాలు:
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారిని అంతం చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. 2035 నాటికి 2015తో పోలిస్తే మరణాల సంఖ్యను  95%, సంభవం రేటు 90% నకు తగ్గించాలని , ఇంకా విపత్కర ఖర్చులను ఎదుర్కొంటున్న ప్రభావిత కుటుంబాలు పూర్తిగా లేకుండా ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకుంది.
 
జనక మోహన రావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
Views: 13

About The Author

Related Posts

Latest News