Carrot: ఆహారంతో పాటుగా ఇవి తీసుకుంటున్నారా...? అయితే మంచిదే...మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉన్నట్లే..!

On
 Carrot: ఆహారంతో పాటుగా ఇవి తీసుకుంటున్నారా...? అయితే మంచిదే...మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉన్నట్లే..!

Carrot is health food :క్యారెట్లు మీ ఆహారంతో పాటుగా తీసుకుంటున్నారా...? అయితే మంచిదే...మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉన్నట్లే..!

క్యారెట్లను వండిన వాటి కంటే పచ్చిగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అవసరమైన ఎంజైమ్‌లు, విటమిన్లు, ఖనిజాలను అత్యధిక మొత్తంలో శరీరానికి అందుతాయి. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ  రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయు.
మెదడు ఆరోగ్యానికి మంచిది.

క్యాన్సర్లు రాకుండా చేస్తాయి:
క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.ఫ్రీ రాడికల్స్ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 
యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, కొలొరెక్టల్, ప్రోస్టేట్ లుకేమియాతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

గుండెకు మంచిది:
క్యారెట్ తినడం వల్ల చెడుకొలెస్ట్రాల్ తగ్గుతుంది.
క్యారెట్‌లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఖనిజం సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఎర్ర క్యారెట్‌లో లైకోపీన్ గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తాయి:
క్యారెట్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 
ఇతర కూరగాయలతో పోల్చితే క్యారెట్‌లో చక్కెర ఎక్కువగా ఉన్నట్లు తెలిసినప్పటికీ ఇవి డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నాయి.

కంటికి...పంటికి....చర్మానికి మంచిది:
బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్ నుండి లభించే విటమిన్-ఎ ఆల్ఫా కెరోటిన్ బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్ల నుండి వస్తుంది. క్యారెట్‌లో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ రెండు సహజ సమ్మేళనాలు రెటీనా,లెన్స్‌ను రక్షిస్తాయి.
క్యారెట్‌లో కాల్షియం మరియు విటమిన్ కె ఉన్నాయి , ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి.దంతాలకు మరియు చిగుళ్లకు మేలు చేస్తాయి. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడే ఒక పోషకం. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రయోజనాలకు కూడా ముఖ్యమైనది. చర్మ ముడతలను తగ్గించే గుణం వలన వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.బీటా కెరోటిన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

హార్మోన్ల సమతుల్యత....
స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను ఉంచుతాయి. ఎండోటాక్సిన్‌లను డిటాక్స్ చేస్తుంది. అదనపు ఈస్ట్రోజెన్‌ను తొలగిస్తుంది. థైరాయిడ్ బ్యాలెన్స్‌లో సహాయపడుతుంది.

గమనిక : ఇవి కేవలం అవగాహనకు మాత్రమే. ఆరోగ్య సమస్యలకు మీ వైద్యుడ్ని సంప్రదించండి.

Views: 7

About The Author

Related Posts

Latest News