Nutrition Food: పోషకాహారాన్ని తీసుకుందాం...అందరం ఆరోగ్యంగా ఉందాం.

On
Nutrition Food: పోషకాహారాన్ని తీసుకుందాం...అందరం ఆరోగ్యంగా ఉందాం.

Nutrition Food: పోషకాహారాన్ని తీసుకుందాం...అందరం ఆరోగ్యంగా ఉందాం.

 
రాజముద్ర వెబ్ డెస్క్ : ఒకే దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉండే మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉండే ప్రజలు యొక్క ఆరోగ్య స్థాయి ఆ దేశం యొక్క అభివృద్ధిని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మంచి పోషకాహారం తీసుకున్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఐతే అందరూ సరైన పోషకాహారాన్ని అన్ని సమయాలలో తీసుకోలేరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, మొదలైనవి అత్యంతావశ్యకం. ఇవి మానవుని శరీరంలో అవసరమైనంత స్థాయిలో లేకపోవడాన్ని పోషకాహార లోపం అని చెప్పొచ్చు. పోషకాహార లోపం అనే పదం పోషకాహార లోపం, అధిక పోషణ రెండింటినీ కలిగి ఉంటుంది. పోషకాహార లోపం అనేది శరీరంలో అవసరమైన పోషకాల లోపాన్ని సూచిస్తుంది, అయితే అధిక పోషకాహారం అధిక పోషకాలను సూచిస్తుంది. పోషకాహార లోపం లేదా అధిక పోషణ అనేది పెద్దలతో పోల్చితే పిల్లలలోనే అధికంగా ఉంటుంది. పిల్లలలో వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం , వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం అనేవి పోషకాహార లోపాన్ని తెలియజేస్తాయి. 
ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక (ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ) 2023 ప్రకారం 
ప్రపంచవ్యాప్తంగా 720 మిలియన్ల నుండి 811 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు, 2019లో కంటే వీరు దాదాపు 161 మిలియన్లు ఎక్కువ. అలాగే 2020లో, 2.4 బిలియన్ల మంది ప్రజలు అంటే  ప్రపంచ జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ మంది, మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఆహార-అసురక్షితంగా తగిన ఆహారాన్ని సక్రమంగా పొందడం లేదు. ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు ఉన్నప్పటికీ, 2022లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 45 మిలియన్ల మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు   లేరని అంచనా వేయబడింది. 148 మిలియన్ల మంది వయస్సుకు తగ్గ  ఎత్తు లేరు.37 మిలియన్లు మంది అధిక బరువు కలిగి ఉన్నారు. 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడం అనే లక్ష్యాన్ని సాధనలో ఇవన్నీ అడ్డంకిగా నిలుస్తున్నాయి.
 
మన దేశ పరిస్థితి:
 
ఇక మన దేశం పరిస్థితి చూస్తే ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలలో మూడింట ఒక వంతు మంది భారతీయులే ఉండటంతో, ప్రపంచంలోనే పిల్లల పోషకాహార లోపం ఉన్నవారిలో భారతదేశం ఒకటి. భారత ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే( ఎన్.ఎఫ్.హెచ్.యస్ )5  ప్రకారం, 'ఐదేళ్లలోపు పిల్లలలో ముప్పై-ఆరు శాతం మంది వయస్సుకు తగ్గ ఎత్తు, 19 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు ,32 శాతం మంది వయస్సుకు తగ్గ బరువు లేరని తెలిపింది. మూడు శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారు. చదువు లేని తల్లులకు పుట్టిన పిల్లలు అత్యల్ప సంపదలో ఉన్న పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐదు సంవత్సరాల పిల్లల్లో రక్త హీనత కలవారు 67 శాతం మంది ఉన్నారు.  ఈ సంఖ్య ఎన్.ఎఫ్.హెచ్.యస్ 4 లో  59 శాతం ఉంది. 50 సం. ల కంటే తక్కువ ఉన్న పురుషులలో 25 శాతం మంది, స్త్రీలలో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 50 ఏళ్లలోపు స్త్రీలలో 19%, పురుషులలో 16% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, అయితే 24% స్త్రీలు మరియు 23% పురుషులు ఊబకాయానికి గురవుతున్నారు. అలాగే, 1.38 బిలియన్ల జనాభాలో దాదాపు 40% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర తర్వాత బీహార్ గుజరాత్‌లలో దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపం అత్యంత దారుణంగా ఉంది. మిజోరాం, సిక్కిం మణిపూర్ వంటి అత్యల్ప పోషకాహారలోపం ఉన్న రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల కంటే పోషకాహార లోపం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.
 
దీనికి గల కారణాలు:
 
కారణాలలో అత్యంత ప్రధానమైనది పేదరికం. వీరిలో కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం వలన సంతులిత ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఒకరి సంపాదనపైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారు. ఇక కొంత మందిలో పోషకాహారం మీద తగిన చైతన్యం లేదు. అలాగే మలేరియా, అతిసారం వంటి అంటువ్యాధులు పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. గర్భంతో ఉన్నవారికి ఎక్కువ మోతాదులో పోషకాలు అవసరం. కాని వారికి సరైన అవగాహన లేక పోషకాహారలోపానికి గురగుచున్నారు. కొన్ని కుటుంబాలలో బాలురులతో పోల్చితే  బాలికలు తక్కువ ఆహారాన్ని తీసుకోవడం కూడా ఒక కారణం. ఇంకా అనాథ పిల్లలు , ఎవరూ లేని వృద్ధులు మొదలైనవారు ఎక్కువ శాతంలో పోషకాహారలోపానికి గురవుతున్నారు. ఇంకా గిరిజనులు, సామాజికంగా వెనుకబడినవారు, మురికివాడల్లో నివాసం ఉన్నవారు, సంచార జాతులవారు మొదలైన వారికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక సమతుల్య ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఇంకో కోణంలో చూస్తే ఎగువ మధ్య తరగతి , ఎగువ తరగతి ప్రజలలో కూడా పోషకాహార లోపం ఉంటుంది. తగినంత సంపాదన ఉన్నా కూడా వారి ఆహారపు అలవాట్లు వలన అంటే పాలిష్ చేసిన బియ్యం వాడడం,పిజ్జాలు బర్గర్లు తినడం, పని ఒత్తిడి వలన తగిన సమయంలో ఆహారాన్ని తీసుకోలేకపోవడం మొదలైనవి కారణాలుగా చెప్పొచ్చు.
ప్రభుత్వాలు చేస్తున్న కృషి:
దేశంలో ఈ లోపాన్ని తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తుంది. వాటిలో కొన్ని పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న బాలికలు స్త్రీలలో తక్కువ బరువుతో పుట్టడం, కుంగుబాటు, పోషకాహార లోపం రక్తహీనతను తగ్గించడానికి కేంద్రం  పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ వంటి పధకాలను అమలు చేస్తుంది. ఇంకా పేదవారికి రేషన్ రూపంలో తగినంత ఆహారాన్ని రాష్ట్రాలు సరఫరా చేస్తున్నాయి. పాఠశాలలో పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాయి. అవసరమైన వారికి ఫోలిక్ ఆసిడ్, ఐరన్ టాబ్లెట్స్ ను అందజేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రభుత్వాలకి ప్రజల సహకారం అవసరం.  ప్రతీ ఒక్కరం కూడా దీనిని రూపుమాపడనికి కృషి చేద్దాం.
 
Views: 16

About The Author

Related Posts

Latest News