Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత బెయిల్ గురించి ఏం చేసిందో తెలుసా

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టు చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే బెయిల్ రావడానికి శతవిధాల ఆమె తరపు లాయర్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఈడీ సిబిఐ పలుమార్లు కవితకు బెయిల్ ఇవ్వద్దని వాదిస్తున్నారు. తాజాగా కవిత మళ్లీ బెయిల్ గురించి ఆమె తరపు లాయర్లు వాదించారు. నేడు రేపు ఆమె వాదనలు విన్న తర్వాత బెయిల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ,రేపు విచారణ
ఢిల్లీ లిక్కర్ ష్కాంలో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను సోమ, మంగళ వారాల్లో ఢిల్లీ హైకోర్టు విచారించనుంది
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడాన్ని, అంతే కాకుండా కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సీబీఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరివాదించారు
కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.
కవిత వాదనలు సోమ వారం, ఈడీ, సీబీఐ వాదనలు మంగళవారం పూర్తి చేయాలని ఆదేశిం చింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా.. ఆదివారం రాత్రి 10 గంటల లోపు ఈ-మెయి ల్ ద్వారా తమ అభిప్రాయా న్ని తెలియజేయాలని సీబీఐకి స్పష్టం చేసింది.
దీంతో బెయిల్ పిటిషన్లపై న్యాయ మూర్తి స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది. కాగా, మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది...