Supreme Court: భారతదేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీ

• పోలీస్ వ్యవస్థ పై సామాన్యులకు సైతం నమ్మకం కలగాలి

On
Supreme Court: భారతదేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీ

Supreme Court issued Orders to Police Stations:

 

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

రాజముద్ర, వెబ్ డెస్క్: పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు సైతం నమ్మకం కుదరాలంటే పోలీస్ సిబ్బంది ప్రజల పట్ల మర్యాదగా, ఆప్యాయంగా, క్రమశిక్షణతో మెలగాలని సూచించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగేలా ఉండాలని పేర్కొంది. 

ఈ క్రింది ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది:


ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. 


ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 


అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.


 ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. 


 అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు. 


కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్ల కు అడ్డాగా మారుతున్నాయి. 


 లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే  ఆరోపణలతో ఆ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. 


 కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి. 


 ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది. 


అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. 
దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.

Views: 13

About The Author

Related Posts

Latest News