World Press Freedom Day: నేటి ప్రపంచంలో జర్నలిస్టులదే కీలక పాత్ర

• ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

On
World Press Freedom Day: నేటి ప్రపంచంలో జర్నలిస్టులదే కీలక పాత్ర

World Press Freedom Day:

దేశానికి రైతులు - ప్రజాస్వామ్యానికి పాత్రికేయులు వెన్నెముక:
 
రాజముద్ర వెబ్ డెస్క్: ఆహారాన్ని అందించే రైతన్నలు దేశానికి వెన్నెముక అయితే వార్తల సమాహారాన్ని అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి వెన్నెముక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పారదర్శక జవాబుదారీ ప్రభుత్వాన్ని పెంపొందించడంలో ప్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యానికి
శాసన, కార్యనిర్వాహక  న్యాయవ్యవస్థలు అనేవి మూడు మూల స్తంబాలు. మీడియాని నాల్గవ స్తంభం( ఫోర్త్ ఎస్టేట్ )గా పేర్కొనడంబట్టి చూస్తే మీడియా పాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది. 
మారుతున్న ప్రపంచంలో వేగంగా నలుమూల నుండి జరుగుతున్న సంఘటనల్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. 
 
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం:
 
ఆఫ్రికాలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలకు నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు నమీబియా దేశంలోని విండ్ హాక్ నగరంలో సమావేశమై పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన తీర్మానాలు చేశారు. ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993 డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను జరుపుకుంటున్నారు.
 
దినోత్సవం లక్ష్యం:
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం దానిని రక్షించడం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం,  ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు.
 
ఈ సంవత్సరం థీమ్:
 
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం 2024 థీమ్ పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో జర్నలిజం పాత్ర . పర్యావరణ సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి, కాలుష్యం వల్ల ఏర్పడే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మీడియా సమర్థవంతమైన సాధనం. అందువల్ల వాటి గురించి ఏదైనా చేయమని ప్రజల ఒత్తిడిని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుతో పాటు, పర్యావరణ జర్నలిజం ప్రతి దేశంలోని నిర్దిష్ట పరిస్థితుల గురించి స్థానిక సమస్యలను కవర్ చేస్తూ అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తుంది.
 
ప్రభుత్వానికి ప్రజలకు వారధి:
 
వార్తలు చేరవేత వెనుక మనకు తెలియని వ్యక్తులు అనేకమంది ఉంటారు. రాత్రనక, పగలనక, భయం లేకుండా వారి ప్రాణాలను కూడా లెక్కజేయకుండా పనిచేస్తున్నారు. వారే జర్నలిస్టులు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలు  సామాజిక సమస్యల గురించి పౌరులకు తెలియజేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తారు. నిష్పాక్షికమైన రిపోర్టింగ్ పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా 
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వాచ్‌డాగ్‌లుగా పనిచేస్తారు. వీరు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉంటారు. ప్రజల సమస్యలను తెలియజేస్తూ వీరు అత్యుత్సాహం, సత్తువ, సంకల్పం, విశ్వాసం, పట్టుదల
అద్భుతమైన మౌఖిక, వ్రాతపూర్వక, వ్యక్తిగత నైపుణ్యాలు కలిగి ఉంటారు. జర్నలిజం అనేది సమాచారాన్ని సేకరించడం, దర్యాప్తు చేయడం, విశ్లేషించడం, ప్రజలకు ప్రచారం చేయడం. ఇది సంఘటనలు  ప్రేక్షకుల మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. సంక్లిష్టమైన సంఘటనలను కథనాలుగా అందిస్తుంది. ఇది వ్యక్తులు సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. జర్నలిజం యొక్క ప్రాథమిక లక్ష్యం సత్యాన్ని ప్రతిబింబించే సమాజంలోని వివిధ అంశాలపై వెలుగునిచ్చే ఖచ్చితమైన సమయానుకూలమైన సంబంధిత సమాచారాన్ని అందించడం. జర్నలిజం తరచుగా తప్పులను వెలికితీయడంలో సంస్థలను జవాబుదారీగా ఉంచడంలో అట్టడుగున నిశ్శబ్దం చేయబడే వారి గొంతులను సమర్థించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాయవలసిన అంశం యొక్క ఖచ్చితత్వం విశ్వసనీయత కోసం సమాచారాన్ని సేకరించి అనేక కోణాల నుండి పరిశోధించి నిపుణులు, సాక్షులు, అధికారులు సాధారణ వ్యక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జర్నలిస్టులు పాటుపడతారు.
 
ఐర్లాండ్ మొదటి స్థానం:
 
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ద్వారా 2002 నుండి సంకలనం చేయబడి ప్రచురించబడిన దేశాల వార్షిక ర్యాంకింగ్. ప్రతి దేశంలోని జర్నలిస్టులు, వార్తా సంస్థలు నెటిజన్‌లు కలిగి ఉన్న స్వేచ్ఛ స్థాయిని ఈ స్వేచ్ఛను గౌరవించడానికి అధికారులు చేసే ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఇది ఉద్దేశించబడింది.  రాజకీయ సందర్భం, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్, ఆర్థిక సందర్భం, సామాజిక సాంస్కృతిక సందర్భం, భద్రతలను పరిగణనలోకి తీసుకొని స్కోర్లు ఇస్తారు. 2023 సంవత్సరంలో నార్వే(95.18), ఐర్లాండ్(89.91), డెన్మార్క్(89.48), స్వీడన్(88.15), ఫిన్లాండ్లు(87.94)
మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 
36.62 పాయింట్స్ తో మన దేశం 161 వ స్థానంలో ఉంది.
 
ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం:
 
జేమ్స్ అగస్టస్ హికీ భారతదేశంలో స్వతంత్ర జర్నలిజానికి పునాది వేశాడు. మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ 
ను స్థాపించాడు. ప్రింట్ మీడియా భారతదేశంలో 1780 లోనే ప్రారంభమైంది. పరిశోధనాత్మక వార్తలు, సంపాదకీయాలు అభిప్రాయాల ద్వారా గెజిట్ వార్తలు సంఘటనలను కవర్ చేయడమే కాకుండా ప్రజల అభిప్రాయాన్ని కూడా రూపొందించింది. వాస్తవాలను నిష్పక్షపాతంగా  సమావేశ స్వతంత్ర మీడియా సంస్కృతికి నాంది పలికిన ఆయన 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం'గా పేరు పొందారు. అణచివేతను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశంలో స్వతంత్ర  స్థాపన వ్యతిరేక ప్రెస్ సంప్రదాయాన్ని స్థాపించిన ఘనత హికీకి ఉంది. పత్రికా లేదా మీడియా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్ర్యం భావవ్యక్తీకరణ కింద భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సూచిస్తుంది . ఇది స్వతంత్ర జర్నలిజాన్ని ప్రోత్సహిస్తుంది. దేశాసమగ్రతను కాపాడేందుకు ఆర్టికల్ 19(2)లో కొన్ని పరిమితులు ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిజం పాత్ర నుండి సమకాలీన సమాజంపై దాని ప్రభావం వరకు, భారతదేశ సామాజిక-రాజకీయ దృశ్యంలో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో భారతదేశంలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహారం-నీటి కొరత, వ్యర్థ పదార్థాల నిర్వహణ జీవవైవిధ్య నష్టం అనేవి ఐదు అతిపెద్ద పర్యావరణ సమస్య లు. వీటిని పరిష్కరించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
Views: 18

About The Author

Related Posts

Latest News